Thursday, April 18, 2024

‘మా’ ప్రెసిడెంట్ గా వంద‌రోజులు – సినిమా టికెట్స్ రేట్ల‌పై – మంచు విష్ణు ఏమ‌న్నారంటే

మా ప్రెసిడెంట్ గా గెలిచి బాద్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు మంచు విష్ణు. కాగా త్వ‌ర‌లోనే మా బిల్డింగ్ ని నిర్మించే ప‌నిలో ఉన్నారు. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి వంద రోజులు కావ‌డంతో ఆయ‌న్ని అభినందిస్తూ ఒక వెబ్ పోర్ట‌ల్ ఇంట‌ర్వ్యూ తీసుకుంది. ఈ ఇంట‌ర్వ్యూలో విష్ణు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించడంపై టాలీవుడ్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై పలువురు స్టార్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒక మా ప్రెసిడెంట్ అయ్యి ఉండి, అందులోను నిర్మాత గా ఉన్న విష్ణు ఒక్కసారి కూడా స్పందించకపోవడంపై విమర్శలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. మీమ్స్ రూపంలో చాలామంది విష్ణును ట్రోల్ కూడా చేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో మొదటిసారి టికెట్ రేట్స్ ఇష్యూపై ప్రెసిడెంట్ విష్ణు స్పందించారు. ‘ ఇండస్ట్రీలో టికెట్ రేట్ల సమస్యపై పెద్దలే పరిష్కారం వెతుకుతున్నారు.. ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదని, వారు సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే నేను మౌనంగా ఉన్నాను. టికెట్ ధరల అంశంలో కొందరు ఛాంబర్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, అందుకే ఎవరుపడితే వాళ్ళు మాట్లాడి ఈ సమస్యను ఇంకా పెంచాలనుకోవడంలేద‌న్నారు. ప్రస్తుతం విష్ణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement