Thursday, May 16, 2024

వైఎస్ఆర్టీపీలో కమిటీలన్నీ రద్దు.. చర్చనీయాంశమైన షర్మిల నిర్ణయం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణలో వైయస్సార్టీపీ తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు ఆమె తెలిపారు.

 గత ఏడాది పార్టీని ప్రకటించిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇన్చార్జీలను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ గా వడుక రాజగోపాల్, రంగారెడ్డి జిల్లాకు ఎడమ మోహన్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు గడిపల్లి కవిత, వికారాబాద్ జిల్లాకు తమ్మాలి బాలరాజ్, నల్గొండ జిల్లాకు ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాకు మహమ్మద్ అత్తార్ ఖాన్, ములుగు జిల్లాకు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నాడెం శాంతికుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అప్పం కిషన్, నిజామాబాద్ జిల్లాకు నీలం రమేశ్, ఆదిలాబాద్ జిల్లాకు బెజ్జంకి అనిల్ కుమార్ తదితరులను కోఆర్డినేటర్లుగా నియమించారు. అయితే ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement