Monday, May 20, 2024

HYD: హెచ్ బీఓ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగ‌న్ ఎస్2 అఫీషియల్ ట్రైలర్ ని ప్రకటించిన జియో సినిమా

హైదరాబాద్: రక్తపాతానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన సిరీస్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కు పేరుంది. అలాంటి షో త్వరలో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎస్2 రాబోతుంది. ఈ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.

దీంతో ఈ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలను ప్రకటించింది జియో సినిమా. ఇది ప్రత్యేకంగా జియో సినిమా ప్రీమియమ్ లో స్క్రీమింగ్ కానుంది. అంతేకాకుండా ఈ హౌస్ ఆఫ్ ద డ్రాన్ ఎస్2 సిరీస్.. భారతీయ బాషలైన ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలి, మరాఠి బాషల్లో జూన్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెరికాతో పాటు భారతదేశంలోనూ ప్రతీ భాగం సోమవారం విడుదల కానుంది. డ్రాగన్‌లు, రాజవంశాల ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ సిరీస్, ఆశయం, విధేయత, ద్రోహం విభిన్న పార్శ్వాలను ప్రదర్శిస్తుంది.

అంతిమంగా ఏడు రాజ్యాలపై నియంత్రణ కోసం పోటీపడే కీలక వ్యక్తుల కథే ఈ సిరీస్. ఈ సిరీస్ లో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌస్సేంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ, సోనోయా మిజునో, రైస్ ఇఫాన్స్ నటించారు. హ్యారీ కొల్లెట్, బెథానీ ఆంటోనియా, ఫోబ్ కాంప్‌బెల్, ఫియా సబాన్, జెఫెర్సన్ హాల్, మాథ్యూ నీధమ్ వంటి అదనపు రిటర్నింగ్ తారాగణం ఇందులో కన్పిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement