Wednesday, May 22, 2024

RCB vs GT | బెంగళూరు బౌలర్ల విజృంభన.. గుజరాత్ ఆలౌట్

చిన్న‌స్వామి స్టేడియం వేదికగా గుజ‌రాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ కు బెంగళూరు బౌలర్స్ చుక్కలు చూపించారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

గుజ‌రాత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో స్కోర్ నెమ్మ‌దించింది. ఇక మిడిలార్డర్ లో షారుఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా (35) మోస్తరు పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్‌కుమార్ చెరో రెండు వికెట్లు తీయగా…. కామెరాన్ గ్రీన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement