Tuesday, July 23, 2024

OTT | విశాల్ రత్నం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

డైరెక్ట‌ర్ హరి దర్శకత్వంలో హీరో విశాల్ చేసిన మూవీ రత్నం. యముడు, సింగం సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన రత్నం సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.

ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘రత్నం’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. మే 23 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement