Friday, April 26, 2024

ప్రతి రైతు కుటుంబానికి అండగా ప్రభుత్వం -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

అకాల వర్షం వల్ల నియోజకవర్గంలో అపార నష్టం మిగిల్చిందని, వడగండ్ల వానకు భారీ వృక్షాలు, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, విద్యుత్ సరఫరా పలుచోట్ల నిలిచిపోయిందని, పలు రకాల పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిని నష్టం వాటిల్లిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే అకాల వడగండ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంటల గురించి, నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల గురించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, రైతులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… చేతికి వచ్చిన పంట నేలా రాలిన దృశ్యాలు చూస్తుంటే తట్టుకోలేక పోతున్నానని, తిరుపతిలో ఉండడం వల్ల ఆకస్మికంగా పడిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులను నేరుగా కలువలేకపోయినందుకు చింతిస్తున్నానన్నారు.

రెవెన్యూ అధికారులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలను పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో జరిగిన భారీ పంట నష్టం గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఎవరు అధైర్య పడవద్దని పంట నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం 100 శాతం ఆదుకుటుందని తెలిపారు. అధికంగా మిర్చి, మొక్కజొన్న, కొన్నిచోట్ల పసుపు పంటలు దెబ్బతిన్నాయన్నారు. నేరుగా హైదరాబాద్ వచ్చి మంత్రి దయాకర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి రైతుల నష్టపోయిన పంట వివరాలు తెలిపి 100 శాతం పరిహారం అందేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు మహేందర్ జి, వసుచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాళ్, ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితీ సభ్యులు, తెరాస మండల, గ్రామ స్థాయి నాయకులు, రైతులు, తహసీల్దార్లు, సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, 15 ,16 ,17 డివిజన్ల కార్పొరేటర్లు, ఏడీఏ, ఈవోలు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement