Friday, May 3, 2024

KKR vs PBKS | చెల‌రేగిన కోల్‌కతా.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్లు వీరవిహారం చేశారు. పంజాబ్‌పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపిన కోల్‌కతా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు బాదారు. సొంత‌మైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్ల‌ను ఉతికేస్తూ మ‌రోసారి భారీ స్కోర్ సాధించారు.

ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్ (75), సునీల్ న‌రైన్(71) అదిరే అరంభ‌మిచ్చారు. చెరో హాఫ్​ సెంచరీలతో బౌండ‌రీల మోత మోగించాడు. ఇక చివ‌ర్లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (28), ఆండ్రీ రస్సెల్ (24) వెంక‌టేశ్ అయ్య‌ర్ (39) చెలరేగారు. దాంతో, పంజాబ్‌కు కోల్‌క‌తా దాదాపు అసాధ్య‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌గ‌లిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement