Thursday, May 2, 2024

Miss Universe | మిస్ యూనివర్స్ అర్జెంటీనా గా 60 ఏళ్ల బామ్మ..

బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ‘లా ప్లాటా’ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల లాయర్ & జర్నలిస్ట్ అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ మిస్ యూనివర్స్ కీరిటాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఆరు పదుల వయసు వచ్చినా.. ఎక్కడ తన వయసును కనిపించకుండా కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ.. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ చరిత్ర కెక్కింది. ఆమె మాట్లాడుతూ.. అందాల పోటీల్లో సరికొత్త చరిత్రకు తాను ప్రాతినిధ్యం వహించడం హ్యపీగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ వృత్తిరీత్యా న్యాయవాది, పాత్రికేయురాలు కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement