Friday, May 17, 2024

TS : హ‌రీష్‌రావు అడ్డాలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సిద్దిపేట‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మాజీమంత్రి హ‌రీష్‌రావు అడ్డ‌లో సీఎం రేవంత్ రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అనంతరం పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రసంగించనున్నారు.

- Advertisement -

హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చి కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిపాడ్ దిగిన తర్వాత బీజేఆర్ చౌరస్తా నుంచి దాదాపు మూడు కిలో మీటర్ల మేర సీఎం రోడ్ షో ను నిర్వహించనున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లాలో వస్తుండడంతో భారీగా స్వాగత ఏర్పాట్ల కు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement