Tuesday, May 14, 2024

IPL : ఇవాళ రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ లో సరిగ్గా 50వ మ్యాచ్ నేడు రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇంతవరకు ఒకే ఒక మ్యాచ్ ఓడి, సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ అప్రతిహితంగా సాగిపోతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ స్ఠానంలో ఉంది. ఇక హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్ లు ధనాధన్ గెలిచి, ఒక్కసారి చతికిల పడింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ప్రస్తుతం 5 వ స్థానంలో ఉంది. మరి ముందుకెళుతుందా? తిరిగి రేస్ లోకి వస్తుందా? లేదా అన్నది చూడాలి.

నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి జరగనుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 18 మ్యాచ్ లు జరిగాయి. రాజస్థాన్ 9 మ్యాచ్ లు, హైదరాబాద్ 9 మ్యాచ్ లు గెలిచాయి. ఈ లెక్కన చూస్తే రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి.

- Advertisement -

హైదరాబాద్ విషయానికి వస్తే ఈ ముగ్గురి మీద విపరీతంగా ఆధారపడి ఉంది. వారు అయిపోతే మొత్తం తేలిపోతోంది. దీంతో అన్ని జట్లు ఆ మూడు వికెట్లపైనే ఫోకస్ పెట్టి, ముందు వారిని లేపేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్ క్రమ్.. వీరే జట్టుకి ప్రధాన బలంగా ఉన్నారు. వీరిలో ఒకరు అయిపోతే తర్వాత నితీష్ నిలబెడుతున్నాడు. లేదంటే తర్వాత వచ్చిన క్లాసెన్ చూసుకుంటున్నాడు.

గత రెండు మ్యాచ్ ల్లో టాప్ ఆర్డర్ ముగ్గురు త్వరగా అయిపోయారు. అప్పుడు మొత్తం భారం వీరిమీద పడటంతో ఒత్తిడితో అవుట్ అయిపోయి మ్యాచ్ లు పోగొట్టారు. మరోవైపు బౌలింగులో కూడా బలంగానే ఉంది.

ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. వారు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి శక్తిని పొదుపుగా వాడుతున్నారు. అందరూ కలిసి జట్టుని ఒక రేంజ్ లో ముందుకు తీసుకువెళుతున్నారు.
బౌలర్లు తేలిపోతుంటే బ్యాటర్లు నిలబెడుతున్నారు. బ్యాటర్లు ముందుగా అవుట్ అయి, లో స్కోరు చేస్తే, తర్వాత బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్ లను నిలబెడుతున్నారు. అందుకే 16 పాయింట్లతో టాప్ వన్ గా ఉన్నారు. మరీ రెండు జట్ల మధ్య నేడు జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement