Thursday, July 25, 2024

IPL : డు ఆర్ డై మ్యాచ్…డిల్లీతో ల‌క్నో ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్.

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్‌పైనే ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలు ఉన్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్. ఢిల్లీకి ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్ నుంచి దూరమవుతుంది. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా లక్నోకు ముంబైతో మరొక మ్యాచ్ మిగిలి ఉంది. అయితే హైదరాబాద్ జట్టుతో ఓటమి తర్వాత లక్నో దిగువ‌కు పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ అనుమానమే అని చెప్తున్నారు. ఇక ఢిల్లీ ఈరోజు గెలిస్తేనే ప్లే ఆప్స్ కు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ ఇంటికి వెళుతుంది. అటు లక్నో సూపర్ జెంట్స్ పరిస్థితి కూడా అంతే. ఇవాళ రెండు జట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ మ్యాచుకు రాహుల్ దూరం కానున్నాడు.

ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 6 గెలిచి, అదే సంఖ్యలో ఓడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆరో స్థానంలో, లక్నో ఏడో స్థానంలో నిలిచాయి. అందుకే ఢిల్లీకి ఇది డూ ఆర్ డై పోటీ.

లక్నో-ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డ్..
లక్నో, ఢిల్లీ మధ్య ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, లక్నో 3 మ్యాచ్‌లను గెలుచుకుంది. అంటే లక్నోదే పైచేయి. గత మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక రోజు ముందుగానే ఆర్సీబి చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో, లక్నో గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement