Wednesday, May 29, 2024

AP : జ‌మ్మ‌ల‌మ‌డుగులో హైటెన్ష‌న్

- Advertisement -

కడప జిల్లా జమ్మల మడుగులో నేడు హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.. నిన్న పోలింగ్ రోజున వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి చేసుకున్నారు. తాజాగా నేడు మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు వైసీపీ, టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన నిడిజివ్వి గ్రామం నుంచి దాదాపు 30 వాహనాలలో తన శ్రేణులతో కలిసి జమ్మలమడుగు వైపు రావడానికి ప్రయత్నం చేశారు. దీంతో ముద్దనూరులో వైసీపీ నేత ముని రాజా రెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మరోవైపు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో ముద్దనూరుకు పోవడానికి సిద్ధం కావడంతో పోలీసులు ఆయనకు సర్ది చెప్పి దేవగుడిలోనే ఆది నారాయణ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేశారు. ఇక, జమ్మలమడుగు తెలుగు దేశం పార్టీ కార్యాలయం దగ్గరకు భారీగా ఎన్డీయే కూటమికి చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో జమ్మలమడుగు, ముద్దనూరు మార్గ మధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పలు చోట్ల పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. టీడీపీ- బీజేపీ- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement