Thursday, May 16, 2024

పేద మహిళల కోసం..

గద్వాల : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా జిల్లాలోని పేద మహిళలు , యువతులకు టైలరింగ్‌ , ఎంబ్రాయిడరి , బ్యుటిషియన్‌ , డ్రైవింగ్‌లలో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తుందని ఎస్పి రంజన్‌ రతన్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని 10 పాస్‌ /ఫెయిల్‌ , పై చదువులు చదివిన 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల మహిళలు మాత్రమే ఈ శిక్షణలకు అర్హులు అని ఆసక్తి గల వారు ఈ నెల 16 నుండి 19 వరకు గద్వాల టౌన్‌ , ఐజ , శాంతినగర్‌ , అలంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో అందుబాటులో ఉంచిన బయోడెట ఫామ్‌లను ఫిల్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలని , అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement