నగరంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోతీ దర్వాజా, జీఎంకే ఫంక్షన్ హాల్ ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని నరికి చంపగా.. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని ఉప్పల్‌కు చెందిన కలీమ్(25)గా గుర్తించారు. కలీమ్‌ను హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దారుణ హత్య

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement