Saturday, April 27, 2024

వెల్‌ఫేర్‌ అసోషియేషన్‌ నూతనకార్యవర్గం..

అల్వాల్‌ : అల్వాల్‌సర్కిల్‌ 134అల్వాల్‌డివిజన్‌లోని పాతఅల్వాల్‌లో వెలసిన శ్రీలక్ష్మీనగర్‌కాలనీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని కాలనీవాసులు వెల్లడించారు. ఈ మేరకు కాలనీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నరసింహరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, శివశరణప్ప పర్యవేక్షణలో ఇట్టి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు అసోషియేషన్‌ అధ్యక్షుడు బి. నాగేశ్వర్‌రావు తెలిపారు. కాలనీనూతన కార్యవర్గ అధ్యక్షుడిగా బి. నాగేశ్వర్‌రావు, ప్రధానకార్యదర్శిగా ఆర్‌ . శ్రీకాంత్‌రావు, ఉపాధ్యక్షులుగా పి. సుధాకర్‌రెడ్డి, ఎన్‌. సాయిరాంగౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా కె. అన్నపూర్ణ, వై. బాపురెడ్డి, కోశాధికారిగా కె. నారాయణ, ఇతర కార్యవర్గసభ్యులుగా వై. రామకృష్ణ, జి. మల్లారెడ్డి, ఎం. గోపాలకిషన్‌రావు, ఆర్‌. లింగారెడ్డి, సలహదారులుగా జి. శంకర్‌రావు, ఎ. సిద్దిరామిరెడ్డి, అంటోని స్వామిలు నియమితులయ్యారని కాలనీవాసులు వెల్లడించారు. ఈసందర్భంగా కాలనీ అభ్యున్నతికి గాను నూతన కార్యవర్గ సభ్యులు ప్రతిజ్ఞచేశారు. కాలనీలో సమస్యల పరిష్కారంతో పాటుగా ప్రతిఒక్కరి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement