Friday, March 29, 2024

మెగాస్టార్ చెల్లెలిగా వరలక్ష్మీ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసీఫర్ రీమేక్‌ మూవీకి సంబంధించి ఫిలింనగర్‌లో ఓ టాక్ వినపడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు చెల్లెలిగా ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఉంటుందని తెలుస్తుండగా దీని కోసం మూవీ టీమ్ ఇప్పటివరకు చాలా మందిని టెస్ట్ చేసింది. కొంచెం నెగిటివ్ ట‌చ్ పాత్ర కావ‌డంతో ఎవ‌రూ ఒప్పుకోవడం లేదట‌. అయితే తాజాగా ఈ పాత్ర‌కు ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మీ శరత్‌కుమార్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇటీవ‌ల క్రాక్, నాంది సినిమాల్లో వరలక్ష్మీ తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. స్వ‌యంగా చిరంజీవి కూడా ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. నెగిటివ్ రోల్‌ను ఎంతో అద్భుతంగా పోషిస్తున్న వ‌ర‌ల‌క్ష్మీనే త‌న చెల్లి పాత్ర కోసం తీసుకోవాల‌ని చిరు మూవీ టీమ్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement