Monday, May 13, 2024

ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

ఓదెల: ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. ఓదెల మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్‌ సంగీత తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా బోధన ఎలా జరుగుతుంని, ఉపాధ్యాయులు సరిగ్గా విధులకు హాజరవుతున్నారా.. పాఠాలు బోధిస్తున్నారా.. అని ఆరా తీశారు. పాఠశాల సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి భోజనాలు నాణ్యతగా రుచిరకంగా అందించాలని సూచించారు. కోడి గుడ్లు ఎన్ని రోజులకు ఇస్తున్నారని, వంటలు సక్రమంగా చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తమకు వంటగదిని నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కి విజ్ఞప్తి చేయగా చేయిస్తానని తెలిపారు. అనంతరం హరిపురం గ్రామంలో పర్యటించిన కలెక్టర్‌ స్మశానవాటిక, డంపింగ్‌ యార్డ్‌ పనులను పరిశీలించారు. పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 31 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కూడా పనులు జరగకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. బాధ్యులైన సర్పంచ్‌తోపాటు- జిపి కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ఏఈలకు షోకాజ్‌ నోటీ-సులు ఇస్తున్నట్లు- తెలిపారు. అనంతరం గ్రామంలోని నర్సరీకి వెళ్లి పనులను పరిశీలించారు. నర్సరీల్లో లెక్క ప్రకారంగా మొక్కలు నాటాలని సూచించారు. నర్సరీ పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసిల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈఓ రాజయ్య, ఎంపీఓ అబ్ధుల్‌ వాజిద్‌, పీఆర్‌ ఏఈ సమ్మిరెడ్డి, జిపి కార్యదర్శులు రాజేందర్‌, శ్రీనివాస్‌, హరి పురం సర్పంచ్‌ గుండేటి మధు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ రాజేందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement