Friday, July 26, 2024

RCB vs DC | ఆదుకున్న పాటిదార్, జాక్స్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీల‌క పోరులో ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు బాదింది. విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 27) బౌండ‌రీలతో హోరెత్తించాడు. ర‌జ‌త్ పాటిదార్ (32 బంతుల్లో 52) ఈ సీజ‌న్‌లో ఐదో అర్ధ శ‌త‌కంతో జ‌ట్టుకు అండ‌గా నిలిచాడు. మ‌రో ఎండ్‌లో డేంజ‌ర‌స్ విల్ జాక్స్ (29 బంతుల్లో 41) ప‌రుగుల‌తో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కామెరాన్ గ్రీన్ (24 బంతులలో 32) ఆకట్టుకున్నాడు.

ఇక ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ సలామ్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా… ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక 188 పరుగుల టార్గెట్‌తో ఢిలలీ క్యాపిటల్స్ జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement