Wednesday, May 29, 2024

AP | చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి….

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని గంటల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరనున్న తరుణంలో తన అభిమాన నేత చంద్రబాబు…. ఏపీ సీఎం కావాలని ఆకాంక్షాస్తూ ఓ వ్యక్తి నాలుక కోసుకున్నాడు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఈ ఘటన కలకలం రేపింది. చంద్రబాబుకు వీరాభిమాని అయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్.. గతంలో రెండు సార్లు ఇలాగే నాలుక కోసుకున్నానని ఓ లేఖ సైతం రాసినట్లు గుర్తించారు.

‘‘ఏపీ ప్రజలారా నాపేరు చెవల మహేష్. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గూటల గ్రామం. నేను గతంలో అంటే 2004 -2009 సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావాలని, 2019లో వైఎస్ జగన్ సీఎం కావాలని నాలుక కోసుకుని, ఇదే వెంకటేశ్వర స్వామి గుడిలో నా మొక్కులు తీర్చుకున్నాను. అంటూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement