Tuesday, May 28, 2024

Delhi | ఢిల్లీ మెట్రో పిల్లర్లపై ప్రొ-ఖలిస్థానీ నినాదాలు..

దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. న్యూఢిల్లీలోని కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నినాదాలు రాశారు.మెట్రో స్టేషన్ల పిల్లర్లపై ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా, ప్రధాని వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నినాదాలను తొలగించిన ఢిల్లీ పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement