Wednesday, May 29, 2024

Air India | విధుల్లో చేరిన ఎయిరిండియా సిబ్బంది..

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో అంతా సర్దుకుంటోంది. ఉద్యోగులంతా తమ విధుల్లో చేరుతున్నారు. దీంతో తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది. అనారోగ్య సెలవులపై వెళ్లి.. తమ నిరసన వ్యక్తం చేసిన క్యాబిన్‌ సిబ్బంది మొత్తం విధుల్లో చేరినట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.

మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో విమానాలు నడుస్తాయని తెలిపారు. కంపెనీలో నిర్వహణ లోపాలు, కొంత మంది సిబ్బందిపై వివక్ష వంటి ఆరోపణలతో క్యాబిన్‌ సిబ్బందిలో దాదాపు 300మంది సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గతవారంలో చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఓవైపు వారితో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు వెంటనే విధుల్లో చేరకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సెలవుపై వెళ్లిన సిబ్బంది మే 11 నాటికి పూర్తిగా విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వెల్లడించింది. అయితే, కంపెనీ షెడ్యూలింగ్‌ సాప్ట్‌వేర్‌లో లోపాల కారణంగా ఇంకా కొంత మంది సెలవుపై ఉన్నట్లు చూపిస్తోందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement