Tuesday, July 23, 2024

RCB vs DC | ఢిల్లీ ఆలౌట్.. కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం

సొంత మైదానంలో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆలౌట్ చేసి చిత్తుగా ఓడించింది. దీంతో ఢిల్లీపై 47 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్ లో ఐదవ స్థానాకి చేరుకుంది. ఆర్సీబీ నిర్ధేశించిన 188 పరుగుల ఛేదనలో ఢిల్లీ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ ఓట‌మిపాలైంది.

విధ్వంసక బ్యటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (21) ధాటిగా ఆడిన‌ప్పటికీ య‌ష్ ద‌యాల్ బౌలింగ్ లో ర‌నౌట్ గా వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్(57) ఒంట‌రి పోరాటం చేసినప్పటికీ ఓట‌మి తప్పలేదు. షాయ్ హోప్ (29), రసిఖ్ సలామ్ (10) పరుగులకే ఔటవ్వగా.. మిగిలినవారు సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement