Tuesday, May 14, 2024

ఫోటోగ్రాఫర్‌ మృతి

చిగురుమామిడి: మండల కేంద్రంలోని సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ పెనుకుల సంతోష్‌(35) అనారోగ్యం కారణంగా మరణించారు. మండలంలో ఉన్న కొద్దిమంది సీనియర్‌ ఫోటోగ్రాఫర్స్‌లో సంతోష్‌ ఒకరిగా ఉన్నారు. అతనికి ఒకపాప, బాబు ఉన్నారు. 15 ఏళ్లుగా వృతిపై ఆధారపడి జీవిస్తున్న సంతోష్‌ అంతిమ సంస్కారాలకు చిగురుమామిడి ఫోటోగ్రాఫర్స్‌ యూనియన్‌ తరుపున తక్షణ సాయంగా రూ. 5వేలను యూనియన్‌ సభ్యులు వారి కుటు-ంబానికి అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ప్రభుత్వం నుండి సాయం చేయాలని యూనియన్‌ సభ్యులు కోరారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు బరిగెల సదానందం, కోశాధికారి మంచికట్ల కనకయ్య, మోహన్‌, శ్రీనివాస్‌, సురేష్‌, నగేష్‌, వెంకటేష్‌, నాగరాజు, సంపత్‌, భార్గవలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement