Sunday, October 6, 2024

TS: ట్రాన్స్ జెండర్లూ… ఓటేత్తారు…!

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : పట్టణ కేంద్రాల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై చైతన్యం తెస్తూ ట్రాన్స్ జెండర్లు సైతం సోమవారం పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఉట్నూర్, పిట్టల వాడ, రాంనగర్, కె ఆర్ కే కాలనీలో ట్రాన్స్ జెండర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద సిరా చుక్క వేలును చూపిస్తూ సెల్ఫీలు దిగారు.

ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో 62.44శాతం పోలింగ్…
మధ్యాహ్నం మూడు గంటల వరకు అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, బోత్, ఖానాపూర్, సిర్పూర్ టీ , ఆసిఫాబాద్, ముధోల్ నియోజకవర్గాల్లో 62. 44 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్ పూర్ టీ, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ క్లోజ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement