Thursday, May 30, 2024

GT vs KKR | వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. ఇక గుజరాత్ జట్టు ఇంటికే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అహ్మాదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఇవాళ రాత్రి జరగాల్సిన మ్యాచ్‌ని వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సాయంత్రం నుంచి చిరుజల్లు కురుస్తున్నా.. రాత్రి కాసేపు వర్షం నిలిచిపోవడంతో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశించారు. కానీ కొద్దిసేపట్లోనే మళ్లీ వర్షం తిరిగి ఆరంభమవడంతో ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని తేల్చేసిన అంపైర్లు.. ఇరు జట్లకి చెరొక పాయింట్ ఇచ్చేసి మ్యాచ్‌ని రద్దు చేశారు.

దీంతో కోల్‌కతా జట్టు క్వాలిఫైయర్ 1లో చోటు దక్కించుకోగా.. గుజరాత్ ఎలిమినేట్ అయింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కోల్‌కగా 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంతో నిలవగా.. 11 పాయింట్లు మాత్రమే సాధించిన గుజరాత్ 8వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement