Saturday, July 27, 2024

TS | ప్రశాంతంగా ఎన్నికలు.. తుది పోలింగ్‌ శాతం రేపు వెల్లడిస్తాం : సీఈవో వికాస్‌రాజ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో 70శాతం వరకు పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. కానీ తుది పోలింగ్‌ శాతం మంగళవారం విడులయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాత్రి వరకు కూడా కొన్ని పోలంఇగ్‌ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి ఉన్నారని, పోలింగ్‌ శాతం సిద్ధం చేసేందుకు సమయం పడుతుందని తెలిపారు.

అయితే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తుది ఓటింగ్‌ శాతం ఎంతనే వివరాలను మంగళవారం వెల్లడిస్తామని తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కారణాలపై 38 కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పోలింగ్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడిన వికాస్‌రాజ్‌ రాష్ట్రంలో పోలింగ్‌ శాతం సంతృప్తికరంగా నమోదైందని పేర్కొన్నారు. సోలింగ్‌ ముగిసిన తర్వాత జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు తరలిస్తామన్నారు.

మొత్తంగా రూ.330 కొట్ల సొత్తు స్వాధీనం…

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్‌ రాత్రి వరకూ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్‌ రూమ్‌
లు ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరతాయని తెలిపారు. కచ్చితమైన పోలింగ్‌ శాతం మంగళవారం మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు.

- Advertisement -

పోలింగ్‌ పై మంగళవారం స్కూట్రినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్‌ అవసరమైతే మంగళవారంనాడుు తెలుస్తుందని వివరించారు. ఆయన ఎస్‌ఆర్‌నగర్‌లోని ఆదర్శ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఉన్నవారు బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఉదయమే పిలుపునిచ్చారు.

ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రానికి చేరడానికి కొంత జాప్యమైందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారని చెప్పారు. అనంతరం మెయిన్‌ పోలింగ్‌ ప్రారంభమైందని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ముగిసిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement