Friday, May 24, 2024

విక్రాంత్‌తో ఆత్మనిర్భర్‌ సాకారం!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ నినాదాలు ఆచరణలోకి వచ్చిన శుభ సందర్భం ఇది. భారత్‌ సాంకేతిక, వైజ్ఞా నిక రంగాల్లో సాధించిన స్వయం పోషకత్వానికి అద్దం పడుతున్న సన్నివేశం. శుక్రవారం కొచ్చిన్‌ షిప్‌ యార్డులో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరిట నిర్మించిన అతి పెద్ద యుద్ధనౌకను నౌకాదళానికి ప్రధానమంత్రి నరేం ద్రమోడీ అందజేశారు. దీనిపై 262 మీటర్ల పొడవు, 62.4 మీటర్లు వెడల్పు కలిగిన ఫ్లయింగ్‌ డెక్‌ ఉంది. ఈ డెక్‌ పరిమాణం రెండున్నర హాకీ మైదానాలంత ఉంటుంది. దీనినుంచి ఒకేసారి 12 యుద్ధ విమా నాలను, ఆరు హెలికాప్టర్లను నడపవచ్చు. శత్రువుల దాడుల వ్యూహాలను పసిగట్టి అప్పటికప్పుడు బయ లుదేరే రీతిలో ఈ విమానాలు సంసిద్ధంగా ఉంటాయి. ఈ నౌక నిర్మాణానికి వినియోగించిన సామగ్రిలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో తయా రైనవే. అరడజనుకు పైగా పెద్ద పారిశ్రామిక సంస్థలు, వంద కు పైగా చిన్న పారిశ్రామిక సంస్థలు (ఎంఎస్‌ఎం ఈలు) ఈ నౌకకు కావల్సిన సామగ్రిని సరఫరా చేశాయి. ఈ నౌక నిర్మాణానికి 20 వేల కోట్ల రూపా యిలు వ్యయం అయింది. ఈ నౌకలో 14 అంతస్తులు ఉన్నాయి. దీనితో మన దేశం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ వంటి దేశాల సరసన చేరింది. ఈ నౌక నిర్మాణం 1999లో ప్రారంభమైంది. ఆనాటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ అనుమతితో నిర్మాణాలు ప్రారంభమ య్యా యి. నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల ఆకృతుల నిర్మాణ సంస్థ దీనిని డిజైన్‌ చేసింది. ప్రస్తుతానికి ఈ భారీ యుద్ధ నౌకకకు సొంత విమాన శ్రేణి లేదు. రష్యాలో తయారైన మిగ్‌ -29లో కొన్నింటిని ఈ నౌకకు తరలించనున్నారు. ప్రస్తుతం ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య నుంచి కూడా మిగ్‌ విమానాలే ఆపరేట్‌ అవుతున్నాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కోసం దాదాపు రెండు డజన్ల విమానాలను సమకూర్చే యోచన ఉందని నౌకాదళం అధికారులు తెలిపారు. ఈ నౌకకు విద్యుత్‌ అందించేందుకు నాలుగు గ్యాస్‌ టర్బైన్‌ ఇంజ న్లను నడిపిస్తాయి. ఈ నాలుగు ఇంజన్లు 88 మెగా వాట్ల విద్యుత్‌ని సరఫరా చేస్తాయి. అత్యంతాధుని కమైన ఈ విమానాలు భారత రక్షణ వ్యవస్థకు గొప్ప బలం. ఇంతవరకూ మన దేశం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడింది.ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద స్వదేశీ పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద దేశంలో తయారైన ముడి సరకులనూ, విడిభాగాలను విని యోగించుకోనున్నది. ఇది ప్రధానమంత్రి కలలను సాకారం చేయనున్నది. ఈ నౌకను ప్రధాని ప్రారం భించడంతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ పయ నంలో మరో ముందడుగు వేసింది. ఇంతవరకూ ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే నిర్మించేవి. పూర్తిగా స్వదేశీ డిజైన్‌తో భారత్‌ తొలిసారిగా ఈ భారీ నౌకను నిర్మించి తన సత్తాను చాటింది. శివా జీ మహరాజ్‌ స్ఫూర్తితో రూపొందించిన కొత్త నావికా దళ పతాకాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ ఆవిష్క రించారు.

యుద్ధ తంత్రంలో ఆరితేరిన శివాజీ మహ రాజ్‌ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతో సము చితంగా ఉందని ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకూక నౌకాదళ పతాకం బానిసత్వ చిహ్నాన్ని మోసింది. ఇకపై స్వతంత్ర భారతదేశం రూపొం దించిన చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ఇది గర్వకారణం. కొత్త జెండాలో అష్టభుజి నౌకాదళ సత్తాను చాటి చెబు తోంది. మనదేశంలో పూర్వ పాలకుల్లో శివాజీ మహ రాజ్‌ నౌకాదళం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. పదివేల మందితో వందల ఏళ్ళ క్రితమే నావికా దళాన్ని ఏర్పాటు చేశారు. దాంతో మొఘలులు తీవ్ర ఆందోళన చెందారు. తమ రాజ్యాలపై శివాజీ దాడి చేస్తారేమోనని భయపడ్డారు.

శత్రువుకి భీతి కొల్పే రీతిలో నౌకాదళాన్ని తీర్చిదిద్దిన శివాజీని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో నౌకాదళ జెండాని రూపొందించాలన్న ఆలోచన మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే వచ్చింది. అది కొంతవరకూ అమలు జరిగి ఇప్పటికి పూర్తిగా సాకా రమైంది. శ్రీలంక తీరానికి ఇటీవల చైనా నిఘా నౌక చేరిన కొద్ది రోజులకే కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఈ ఆధునిక భారీ నౌక ప్రారంభం కావడం భారత్‌ సత్తాని చాటుతోంది. రక్షణ రంగంలో స్వదేశీ ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టేందుకు మన దేశం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శ నంగా నిలుస్తోంది.
ఎటువంటి సవాల్‌నైనా ఎదుర్కోగల శక్తి మన త్రివిధ దళాలకు ఉందని రుజువు చేసుకునే ప్రయత్నం నిరంతరం సాగుతోంది. ఇది ఫలించి మన దేశం మరింత బలోపేతం కావడానికి ఆత్మనిర్భర్‌ భారత్‌కి చేయూతనిస్తుందని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement