Monday, July 22, 2024

Editorial: హర్యానాలో రాజకీయ సంక్షోభం!

హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వానికి బలం లేదనీ, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఈ పరిణామం బీజేపీని కల వర పరుస్తోంది.హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌లాల్‌ కట్టార్‌ని రాజీనా మా చేయించి ఆయన స్థానే సైనీని అధిష్టానం ఎంపిక చేసింది.

- Advertisement -

హర్యానాలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నా రు. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఇండి పెండెంట్లుమంత్రి పదవులను ఆశించారు. ఇందుకు అధిష్టానం నుంచి అనుమతి లభించలేదు. దాంతో వారు సైనీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. హర్యానా అసెంబ్లిలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా, బీజేపీ బలం 39. ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉప సంహరణతో అది ఇప్పుడు 36కి తగ్గింది. బీజేపీ తన బలా న్ని రుజువు చేసుకోవడానికి 45 మంది సభ్యులు అవస రం. కాగా, ఇప్పటి వరకూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ మనవడు, జననా యక్‌ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా నేతృ త్వంలోని పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే ఆ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని దుష్యంత్‌ చౌతాలా ఇప్పటి కే ప్రకటించారు.

అయితే, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్ట డం అంత సులభం కాదు, అందుకే,కాంగ్రెస్‌ ఆ ప్రయ త్నాలు చేయడం లేదు. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని గురించి గవర్నర్‌కి తెలియజేసింది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్‌ లాల్‌ కట్టార్‌ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెర వెనుక యత్నాలు సాగిస్తున్నారు. దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జయనాయక్‌ జ నతా పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కృషి కొంతవర కూ ఫలించినట్టు కనిపిస్తోంది. చౌతాలా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కట్టార్‌ని కలుసుకుని చర్చలు జరిపారు. కాగా, తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్య మంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ స్పష్టం చేశారు.

గత నెలలోనే అసెంబ్లిలో బలపరీక్షలో నెగ్గాననీ, మరోసారి బలపరీక్షకు అవసరమైతే సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఫిరాయింపు లపై దృష్టి పెట్టలేదు. కానీ, బీజేపీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తేల్చుకోవడా నికి వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు చౌతాలా లేఖ రాశారు. ఎన్నికలు తుది దశకు చేరుకున్నందున ఈ హడావుడిలో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది అనుమానాస్పదమే. గవర్నర్‌పై కేంద్రం నుంచి ఒత్తిడి ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా,అదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది. మొత్తం మీద హర్యానాలో రాజకీయ అస్థిరత ఉన్న మాట నిజం. హర్యానా ఆది నుంచి రాజకీయ అస్థిరతకు పేరొందింది.రావు బీరేందర్‌ సింగ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీలను అతి సునా యాసంగా మారేవారు. పొద్దున ఒక పార్టీలోనూ, రాత్రి మరో పార్టీలోనూ ఉండేవారు. హర్యానా పరిస్థితిని బట్టే ఆయారామ్‌ గయారామ్‌ అనే నానుడి పుట్టింది.

ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా, ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీ కాంగ్రెస్‌ని మించి పోయింది. దేవీలాల్‌, బన్సీలాల్‌, భజన్‌లాల్‌ వంటి హేమాహేమీల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడం హర్యానాలో రికార్డు సృష్టించింది. ఇందిరాగాంధీ హయాంలో ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ ఏకంగా మొత్తం జనతాపార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంగా మార్చేసి చరిత్ర సృష్టించారు. హర్యానా పేరు చెబితే పార్టీల ఫిరాయిం పులు గుర్తుకు వస్తాయి. మోడీ కేంద్రంలో ప్రధానిగా వచ్చిన తర్వాత రాజకీయ అస్థిరతకు తెరపడింది. మనోహర్‌ లాల్‌ కట్టర్‌ మోడీకి ఆర్‌ఎస్‌ఎస్‌లో సహచరు డు. రాష్ట్రంలో రాజకీయ బలం లేకపోయినా ఆయన అండతోనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఎంపీ పదవికి పోటీ చేయించేందుకు ఆయనను మోడీయే రెండు నెలలక్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారు. రాజకీయ అస్థిరత మళ్ళీ చోటు చేసుకుం టుుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది.అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీఈ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించవచ్చు. హర్యానా అస్థిర రాజకీయాలకు పెట్టింది పేరు. ఈసారి ఏమవుతుందో మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement