Thursday, May 30, 2024

Editorial : పాలస్తీనాకు మంచిరోజులు!

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దళాలు అడ్డు,అదుపు లేకుండా దాడులు సాగిస్తున్న తరుణంలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేయడం, పలు దేశాలు పాలస్తీనాకు దౌత్యపరమైన హోదాను ఇచ్చేందుకు అంగీకరించడం ముఖ్యమైన పరిణామాలే. దీనికి తోడు నార్వే సహా మూడు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిర్ణయించ డాన్ని బట్టి పాలస్తీనాకు మంచిరోజులు వస్తున్నాయని భావించవచ్చు.

- Advertisement -

ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకి చెందిన హమా స్‌ దళాలు జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ అంత కు ఎన్నో రెట్లు దెబ్బతీసేందుకు గాజా ప్రాంతంపై దాడు లు కొనసాగిస్తోంది. హమాస్‌ దళాల దాడులను భారత్‌ కూడా ఖండించింది. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ దళాలు చేస్తున్న దాడులనూ ఖండిస్తోంది.కానీ, పాశ్చా త్య మీడియా హమాస్‌ దాడులనే భూత ద్దంలో చూపి స్తోంది, పాలస్తీనాలో ఇప్పటికీ కొనసాగుతున్న దాడుల్లో ఇంతవరకూ 16వేల మంది పైగా పాలస్తీనియన్లు మర ణించారు. పాలస్తీనా ప్రజలకు వివిధ దేశాల నుంచి వస్తు న్న ఆహారపు ట్రక్కులనూ, వైద్య సదుపాయాలను ఇజ్రాయెల్‌ దళాలు అడ్డుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణహోమాన్ని అడ్డుకునే శక్తి అమెరికా కి ఉన్నప్పటికీ, అమెరికా అండచూసుకునే ఇజ్రాయెల్‌ చెలరేగి పోతోంది.ఈ తరుణంలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 143 దేశాల మద్దతుతో ఆమోదించడం ముమ్మాటికీ కీలక పరిణామమే.

మన దేశం మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతుగా ఉంది. ఎంతో కాలంగా పాలస్తీనాకు సంఘీ భావంగా నిలుస్తోంది. ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 25దేశాలు పాల్గొనలేదు. ఈ తీర్మానం అత్యధిక మెజారి టీతో నెగ్గడం ఇజ్రాయెల్‌కి కంటగింపుగా ఉంది. స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నామని నార్వే, ఐర్లాండ్‌, స్పెయిన్‌ లు ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తూర్పు జెరూసలెం,వెస్ట్‌ బ్యాంక్‌,గాజా స్ట్రిప్‌లను కలిపి స్వతంత్ర పాలస్తీనాగా గుర్తించాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి. ఈనెల 27వ తేదీన ఈ మూడు దేశాలూ అధికారికంగా ప్రకటించనున్నాయి. మధ్య ప్రాచ్యంలో శాంతి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఐర్లాండ్‌ ప్రధాని సైమన్‌ హ్యారీస్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యం లో అల్లకల్లోలం సృష్టించడానికి ఇ జ్రాయెల్‌ సాగిస్తున్న యత్నాలను అమెరికా అడ్డుకోలేకపోవడాన్ని అన్ని దేశా లూ ఖండిస్తున్నాయి. 1967లో జరిగిన మధ్యప్రాచ్య యుద్ధంలో ఈ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్ర మించుకుంది.గాజాపై ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన దాడు లు మానవత్వానికే మచ్చ తెచ్చాయి.

ముఖ్యంగా చికిత్స పొందుతున్న రోగులపట్ల కనికరం చూపకుండా ఆస్పత్రి పౖౖె ఇజ్రాయెల్‌ దళాలు బాంబు దాడులు చేశాయి. గాజా ప్రజల పట్ల ప్రపంచ దేశాలన్నీ సానుభూతిని వ్యక్తం చేస్తుంటే ఇజ్రాయెల్‌ మాత్రం పరమ దాష్టీకంగా వ్యవహ రిస్తోంది. 1948నుంచి ఈ సమస్య నలుగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌ని దేశంగా గుర్తించడమే కాకుండా, దానికి ఆయుధ, ఆర్థిక పరంగా అమెరికా సాయాన్ని అందిస్తోం ది. పాలస్తీనాపైనే కాకుండా ఇజ్రాయెల్‌ దళాలు సిరియా లోనూ, ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరి పాయి. నార్వే, స్పెయిన్‌, ఐర్లాండ్‌లపై ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఈ మూడు దేశాల నుంచి తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. హమాస్‌ దళాలు హంతకులు, రేపిస్టులతో కూడి ఉన్నాయనీ, అటువంటి వారికి గుర్తింపు ఇవ్వడమంటే ఇక సభ్యత, సంస్కారాల కు తావు ఎక్కడుందని ఇజ్రాయెల్‌ ప్రశ్నిస్తోంది. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్ర విమర్శలు చేసింది. పాలస్తీనా సార్వభౌమాధికార ప్రభుత్వంగా అవతరించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని ప్రపంచ దేశాల శాంతి కాముకులు పేర్కొంటున్నారు.

పాలస్తీనా సమస్య పరిష్కారానికి పాలస్తీనా విమోచనా సంస్థ (పిఎల్‌ఓ) నాయకుడు యాసర్‌ అరాఫత్‌ ఎంతోకృషి చేశారు. ఆయనపై ఇజ్రాయెల్‌ ఎన్నోసార్లు హత్యాయత్నా లు జరిపించింది. అరాఫత్‌ కృషి కారణంగానే ప్రపంచ దేశాల్లో పాలస్తీనా అంటే ఏమిటో, దాని సమస్యలేమిటో తెలిసొచ్చాయి. ఈ విషయంలో అరబ్‌ దేశాలు పాలస్తీనా కు అండగా నిలిచినప్పటికీ ,ఈ దేశాల్లో అమెరికా మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా వంటివి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వస్తున్నాయి. పాలస్తీనా ప్రజలు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ దాడులతో అభివృద్ధికి నోచుకో వడం లేదు. పాలస్తీనాలో ఆస్పత్రులు ఇతర మౌలికసదు పాయాలు పెరగకపోవడానికి కారణం అశాంతే. అక్కడ ప్రజలు నైపుణ్యాన్ని, సత్తాను కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ దాడుల వల్ల ముందుకు రాలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement