Friday, June 14, 2024

RR : వికారాబాద్​లో సిసి రోడ్డు కబ్జా

వికారాబాద్, ప్రభ న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు విషక్కన్ భాగంలో మున్సిపాలిటీకి చెందిన సిసి రోడ్డును వ్య‌క్తి భాజప్త కబ్జా చేస్తున్నారు. ఇషాక్కన్ బాగ్ లో గతంలో వేసిన సిసి రోడ్డును తన సొంత భూమిగా భావిస్తూ వ్యక్తి తన హ‌ద్దులను సూచిస్తూ ఫెన్సింగ్ వేస్తున్నారు.

- Advertisement -

ఈ విషయమై మున్సిపల్ అధికారులు పాలకవర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడిబొడ్డున ఇలా కబ్జాలు చేస్తుంటే పాలకవర్గం అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు సూచన చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement