Monday, June 24, 2024

TS : ఆ జిల్లాలలో రెండు రోజులు వైన్స్ బంద్

ఇవాళ్టి నుంచి రెండు రోజులు వైన్స్ మూసివేయాల‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (వరంగల్, హనుమకొండ, జనగామ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -

ఈ ఉత్తర్వులమేరకు నేటి సాయంత్రం 5 గంటల నుంచి 27వ తేది సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement