Monday, June 24, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : బుద్ధిమంతుడు (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని బుద్ధిమంతుడు గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
బుద్ధిమంతుడు

అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యో మతి మాన్నర:
సర్వత: సారమాదధ్యాత్‌ పుష్పేభ్యైవ షట్పద:

బుద్ధిమంతుడైన వాడు చిన్న శాస్త్రములు, గొప్ప శాస్త్రముల నుండి తుమ్మెద పూవుల నుండి మకరందమును సేకరించినట్టు సారమును స్వీకరిస్తాడు.

తుమ్మెద తాను మకరందమును స్వీకరించునపుడు పూవు చిన్నదైనా, పెద్దదైనా ప్రతి దానిలో నుండి అందులో ఉన్నంత మకరందాన్ని ఆ పుష్పానికి హాని కలగకుండా తీసుకుంటుంది. పూవు రెక్కలు రాలినా పూవు వాడినా తొడిమ రాలినా మకరందము తీసుకోలేదు. అందుకే పూవును జాగ్రత్తగా రక్షిస్తూ అపాయం జరగకుండా ప్రతీ పూవు నుండి మకరందమును స్వీకరిస్తుంది. అట్లే బుద్ధిమం తుడైన వాడు, చిన్న, పెద్ద శాస్త్రముల నుండి చిన్నవా పెద్దవా అని ఆలోచించకుండా ఆ శాస్త్రములకు ఆ శాస్త్ర గ్రంథములకు ఎలాంటి హాని కలగనీయకుండా శాస్త్ర సారాన్ని గ్రహిస్తాడు. దాని వల్ల తాను గ్రహించిన శాస్త్రాన్ని, తనకు శాస్త్రాన్ని అందించిన గ్రంథాలను తరతరాలుగా జ్ఞానాన్ని అంతరాలు లేకుండా అందిస్తాడు. అదే బుద్ధిహీనుడు తాను శాస్త్రాన్ని తీసుకోడు శాస్త్ర గ్ర ంథాలను నష్టపరుస్తాడు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement