Saturday, June 15, 2024

Suspended | కేసు దర్యాప్తులో అవకతవకలు.. ఎస్ఐ సస్పెండ్

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వి.రవికాంత్ పై సస్పెన్‌షన్ వేటు వేస్తూ.. మల్టీ జోన్ 1 ఐజిపి ఎ.వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసులో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడిన కారణంగా ఎస్‌ఐ వి.రవికాంత్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం సస్పెండ్ అయిన ఎస్. ఐ రవికాంత్ గతంలో మెదక్ జిల్లా శివంపేట్ ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలో మామిడి తోటలో యాభై టన్నులకు పైగా మామిడి పండ్లు చోరికి గురైనట్లుగా సంబంధిత మామిడి తోట యజమానురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ తక్షణమే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే… కేసు సివిల్ పరిధిలోకి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి చోరీ కేసును సివిల్ వివాదం కేసుగా ముగించేందుకు ఎస్‌ఐ రవికాంత్ అవకతవకలకు పాల్పడ్డాడు.

దాంతో పాటు భూతగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు రావడంతో మెదక్ ఎస్పీ సమర్పించిన విచారణ నివేదికలో ఎస్‌ఐ రవికాంత్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో వి.రవికాంత్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement