Wednesday, May 29, 2024

Satyabhama ట్రైల‌ర్ రిలీజ్… పోలీస్ ఆఫీసర్‌‌గా అదరగొట్టిన కాజ‌ల్

కాజ‌ల్ అగర్వాల్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘స‌త్య‌భామ‌’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో తొలి సారి లేడి ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది కాజల్. కాగా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. హైద‌రాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఈ మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. నంద‌మూరి అంద‌గాడు, స్టార్ హీరో బాల‌య్య ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు.

YouTube video

ఇక ఈ సినిమాలో కాజ‌ల్ పోలీసీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండగా.. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. ఇక ఈ సినిమాని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement