Friday, June 14, 2024

Qualifier-2 | హైదరాబాద్‌ను ఆదుకున్న క్లాసెన్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024 ఫైనల్ బెర్త్ కోసం చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ ముందు ఓ మోస్తరు లక్ష్యమే ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హెన్రిచ్ క్లాసెన్‌(50) తన అర్థ శతకంతో ఆదుకున్నాడు. ఇక ట్రావిస్ హెడ్ (34), రాహుల్ త్రిపాఠి (37) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, బౌల్ట్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక 176 పరుగుల టార్గెట్‌తో రాజస్థాన్ జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement