Thursday, May 2, 2024

నేనే నా @ రెజీనా !!

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం నేనేనా. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెన్నెలకిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే శామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఒక మిస్టరీని ఛేదించడానికి తన అన్వేషణ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక అస్థిపంజరంను పరిశీలిస్తూ కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement