Thursday, May 16, 2024

TS | అమిత్ షా ఫేక్ వీడియో.. ఆరుగురు అరెస్ట్

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిలర్స్ మన్నే సతీష్, నవీన్, తస్లీమాతో పాటు గీత, శివ, అస్మా ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement