Tuesday, July 23, 2024

HYD | బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం..

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా బేగంపేట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు ట్రావెల్‌ బస్సును ఢీకొని ప్లై ఓవర్‌ గోడను రివర్స్‌లో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్‌తో పాటు మహిళకు గాయాలయ్యాయి.

ఈ ఘటనతో ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫ్లైఓవర్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయితే మితిమీరిన వేగం కారణంగా కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement