Friday, October 11, 2024

AP | జూన్ 9న సీఎం జగన్ ప్రమాణస్వీకారం : బొత్స

ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని… రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల‌ ఫలితాలు వెల్లడి అనంతరం జూన్ 9వ తేదీన విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.

ఓటమి భయంతోనే టీడీపీ దాడులు చేస్తోందని విమర్శించారు.. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమ పార్టీ నేతలు ఎంతో శాంతియుతంగా ఉంటున్నారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోతున్న నేతలు, కార్యకర్తలు అంతా తోక ముడిచి సైలెంట్ అవుతారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement