Tuesday, July 23, 2024

Protest – రైతుల కోసం రోడ్డెక్కిన బి ఆర్ ఎస్

కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టారు.వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

కాగా, కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని.. వీటిని కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికలైపోయిన తర్వాత వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతూ రైతులను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement