Monday, July 22, 2024

Andhra Pradesh – అదుపులోకి వ‌చ్చిన అల్ల‌ర్లు… హౌజ్ అరెస్ట్ లో టిటిపి, వైసిపి నేత‌లు

రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న ఎపి లో ప‌రిస్థితులు క్ర‌మ‌క్ర‌మంగా అదుపులోకి వ‌స్తున్నాయి..ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన ప్రాంతాల‌లో, స‌మ‌స్య‌త్మాక ప్ర‌దేశాల‌లోభారీగా పోలీసులు మోహ‌రించారు.. ప‌లు జిల్లాలోని ప‌ట్ట‌ణ‌,న‌గ‌రాల‌లో 144 సెక్ష‌న్ నివేదాజ్ఞ‌లు కొన‌సాగిస్తున్నారు. అలాగే ప‌ల్నాడు, రాయ‌చోటి ,తిరుప‌తి, తాడిప‌త్రి, జ‌మ్మ‌ల‌మడుగు త‌దిత‌ర ప్రాంతాల‌లోని టిడిపి, వైసిపి ముఖ్య నేత‌ల‌ను గృహ నిర్భంధంలో ఉంచారు పోలీసులు..
హ‌ద్దు మీరితే కాల్పులు జ‌రిపేందుకు కూడా వెన‌కాడ‌బోమ‌ని పోలీసులు హెచ్చరిక‌లు పంపారు.. అంతే కాకుండా ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఇత‌ర పోలీసు అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన డిజిపి హ‌రీష కుమార్ గుప్తా హింస‌కు ఎవ‌రూ పాల్ప‌డిన క‌ఠినంగా అణ‌చివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.. స‌మ‌స్య‌త్మాక ప్రాంతాల‌లో డిఎస్పీ స్థాయి అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు ప‌రిర‌క్షించాల‌ని కోరారు.

తేరుకున్న ప‌ల్నాడు

- Advertisement -

పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి.

పిన్నెల్లిలో పెట్రో, నాటు బాంబులు ప‌ట్టివేత

ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. వైసిపి, టిడిపి నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు. వెంట‌నే వాటిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.. సంబంధిత వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి.. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. 144 సెక్షన్‌ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. నాయకులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతూ.. తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని గుర్తించిన పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.

రాయ‌చోటిలో టిడిపి అభ్య‌ర్ది హౌజ్ అరెస్ట్..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేత వండాడి వెంకటేశ్వర్లు ఇంటివద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసుల వలయంలో రాయచోటి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అసవరం అయితే 144 సెక్షన్ విధిస్తామని తెలిపారు.

తిరుప‌తి ఘ‌ట‌న‌లో 13 అరెస్ట్
తిరుప‌తిలో చంద్ర‌గిరి టిడిపి అభ్య‌ర్ధి పుల‌వ‌ర్తి నానీ దాడి కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ 13 మంది ఆరెస్ట్ చేశారు.. ఇందులో ప్రధాన నిందితులిద్దరూ కూడా ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.. ఇక చంద్ర‌గిరిలో 144 సెక్ష‌న్ నిషేదాజ్ఞ‌లు అమ‌లు చేస్తున్నారు.. అలాగే టిడిపి, వైసిపి నేత‌లెవ్వ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని పోలీసులు కోరారు.. అలాగే వారి ఇళ్ల వ‌ద్ద భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement