Monday, September 30, 2024

Andhra Pradesh – టిడిపి మ‌హానాడు వాయిదా….

ప్రతి సంవత్సరం జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈ ఏడాది బ్రేక్‌ పడింది. దానికి కారణం ఎలక్షన్‌ ఫలితాలు. అసలు అయితే ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌కు నివాళి, పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు యధావిధిగా ఉంటాయని అధినేత చెప్పారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహిచాలి?.. తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement