Thursday, May 16, 2024

Top Trending | డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న పుష్ప సాంగ్‌..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే, ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే రికార్డులు కొల్లగొడుతొంది. యూట్యూబ్ లో పుష్ప సాంగ్‌ సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 6 భాష‌ల్లో క‌లిపి 40 మిలియ‌న్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో నిలిచింది.

అందులోనూ అత్య‌ధికంగా 13 మిలియ‌న్ల వ్యూస్ తో హిందీ వ‌ర్షెన్ ట్రెండింగ్ లో ఉండగా.. ఆ త‌రువాత 11 మిలియ‌న్ల తో తెలుగు వ‌ర్షన్ ట్రెండింగ్ అవుతొంది. దాంతో పాటు 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇక ప్రస్తుతం.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement