Tuesday, May 28, 2024

Phonepe : శ్రీలంకలో యూపీఐ పేమెంట్‌ స్వీకరణను ప్రోత్సహించడం కోసం లంకాపేతో ఫోన్‌పే ఒప్పందం

హైద‌రాబాద్ : పొరుగు దేశమైన శ్రీలంకలో యూపీఐ పేమెంట్లను ప్రోత్సహించడం కోసం లంకాపేకు తమ సహకారాన్ని అందిస్తున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. లంకా క్యూఆర్‌ మర్చంట్ పాయింట్లు అన్నింటిలోనూ ఇకపై యూపీఐ పేమెంట్లను అంగీకారం లభిస్తుందని కొలంబోలో జరిగిన కార్యక్రమంలో తెలిపింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా మాట్లాడుతూ… భారత్, శ్రీలంకల మధ్య సంబంధాన్ని మెరుగు పర్చడంలో ఈ ఫిన్‌టెక్ అనుసంధానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈసమావేశంలో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ నందలాల్ వీరసింఘే ప్రసంగిస్తూ… ఈ పరస్పర సహకార సామర్థ్యం వల్ల కొత్త అవకాశాలు అందరికీ అందుబాటులో వస్తాయని, దీని వల్ల పోటీతత్వం పెరిగి శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

లంకాపే సీఈఓ ఛన్నా డి సిల్వా మాట్లాడుతూ… శ్రీలంకలో డిజిటల్ పేమెంట్ల భవిష్యత్తు, శ్రీలంకలో వ్యాపారాలకు అవకాశాలు అనే అంశంపై ఆలోచింపజేసే ప్యానెల్ చర్చను నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక వ్యాపారాలకు ఉన్న అవకాశాలు, అలాగే అభివృద్ధి మార్గాలపై చర్చించారు. ఈ సెషన్‌లో నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ జీఎం, సీఈఓ శశి కందాంబి, హాటన్ నేషనల్ బ్యాంక్ పీఎల్సీ, సీఓఓ, సంజయ్ విజేమన్నె, ఎల్ఓఎల్సీ ఫైనాన్స్ పీఎల్సీ ఛైర్మన్ కాన్రాడ్ డియాస్, డైలాగ్ ఫైనాన్స్ పీఎల్సీ చైర్‌పర్సన్ రేణుకా ఫెర్నాండో పాల్గొన్నారు. డిజిటల్ పేమెంట్ టెక్నాలజీని వ్యాపార సంస్థలు ఎలా ఉపయోగించాలి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో పోటీని తట్టుకుని విస్తృత మార్కెట్‌లోకి ఎలా ప్రవేశించాలి వంటి అంశాలను చర్చించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement