Tuesday, July 23, 2024

Avantika : హాలీవుడ్ మ్యాగ్ జైన్ పై తెలుగ‌మ్మాయి..

టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం హాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ అవంతిక వందనపు. ఈ అమ్మడు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ యాక్టర్ నటించింది. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ అజ్ఞాతవాసి వరకు తెలుగులో వరుస సినిమాలు చేసింది.

- Advertisement -

అమెరికన్ ఇండియన్ అయిన అవంతిక కేవలం సినిమాలలో నటించడం కోసం ఇండియాకి వచ్చేది. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అవంతిక స్పిన్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత మోక్షి, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్, టారోట్ మూవీస్ లో నటించింది. ఈ సినిమాలలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లో అవంతిక నటిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే దిశగా అవంతిక దూసుకుపోతోంది.

హాలీవుడ్ కల్చర్ కి సెట్ అయ్యేలా తన లుక్స్ ని మార్చుకున్న ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీ, బ్యూటీ మ్యాగజైన్ గలోరి కవర్ పేజీపై ఫోటోలకి ఫోజులిచ్చే ఛాన్స్ ని అవంతిక అందుకుంది. ఈ మ్యాగజైన్ హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ ని హైలైట్ చేస్తూ ఉంటుంది. గలొరి మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయిన ఆమె హాట్ ఫోటోలు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement