Thursday, May 16, 2024

AP | కూటమికి సపోర్టుగా సినీ నటి నమిత.. ధర్మవరంలో ఎన్నికల ప్రచారం

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ నేత సత్య కుమార్ కు మద్దతుగా సినీ నటి బీజేపీ మహిళా నేత నమిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి దేవి దేవాలయంలో నమిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మవరం పట్టణంలో నమిత రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గం లోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నమిత కొనసాగుతున్నారు. చెన్నైలో కూడా లోక్‌సభ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ధర్మవరం నుంచి కూటమి తరపున బీజేపీ నేత సత్యకుమార్ బరిలో ఉండగా.. ప్రత్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈరోజు ముదిగుబ్బ మండలంలోని ముక్తాపురం, గుడ్డంపల్లి తండా గ్రామాల్లో సత్యకుమార్ పర్యటించారు.

అదేవిధంగా నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యతను తీసుకుంటానని ప్రజలకు చెబుతున్నారు. తనను ఆదరించి గెలిపిస్తే నిత్యం ఇక్కడే ఉండి అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆదరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement