Wednesday, February 21, 2024

ట్విట్టర్ లో కొనసాగుతా…బండ్ల గణేష్

బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా…నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతే కాకుండా వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారు. అయితే సోషల్‌ మీడియాలో యాక్టీవ్ గా ఉండే గణేష్ ఇటీవల ట్విట్టర్‌కు గుడ్‌ బై చెప్పబోతున్నాను అంటూ ప్రకటించారు. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. వివాదాలకు తావు లేకుండా జీవించాలనుకుంటున్నా అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే తాజాగా బండ్ల గణేశ్‌ మనసు మార్చుకుని ఓ జర్నలిస్టు సూచన మేరకు ట్విటర్‌లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే విషయం చెబుతూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. దీనితో వెల్‌కం అన్న అంటూ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement