Thursday, May 16, 2024

Kubera | నాగార్జున ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్‌..

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న మూవీ ‘‘కుబేర‌’’. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ధ‌నుష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా గురువారం నాగార్జున లుక్‌ గ్లింప్స్‌ను రివీల్ చేశారు.

సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక మందాన్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement