Thursday, May 16, 2024

AP | నాలుగో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తాం – ప్రైవేట్ హాస్పిటల్స్..

ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వానికి బిల్లుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. తాజాగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కూడా తమకు ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తక్షణం చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తాము చికిత్సలు అందించలేక అప్పుల పాలయ్యామని.. శనివారం నుంచి చికిత్సలు నిలిపివేస్తామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే బిల్లులు పెండింగ్ లో పెడతారని.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు ఆందోళనతో ఉన్నాయి.

గ‌త‌ ఆరు నెలల కాలంలో మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని ఇంకా రూ.వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆస్పత్రుల నిర్వహణ సమస్యగా మారుతుందన్నారు. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement