Wednesday, May 29, 2024

HYD: పనిచేస్తున్న ప్రదేశంలో ఏఐ స్థితిపై భారతదేశ ఫలితాల విడుదల చేసిన లింక్డ్‌ఇన్

హైద‌రాబాద్ : మైక్రోసాఫ్ట్ అండ్ లింక్డ్‌ఇన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్‌ ను పనిచేస్తున్న ప్రదేశంలో ఏఐ స్థితిపై భారతదేశ ఫలితాలను విడుదల చేసింది. ఈ నివేదిక, ఏఐ ఎట్ వర్క్ ఈజ్ హియర్. నౌ కమ్స్ ది హార్డ్ పార్ట్ శీర్షికన విడుదల చేసింది. ఈ నివేదికలో కేవలం ఒక సంవత్సరంలో ప్రజలు పని చేసే, నడిపించే, అద్దెకు తీసుకునే విధానాన్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందో చూపించింది.

ఈసంద‌ర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోస్ మాట్లాడుతూ… వర్క్ ట్రెండ్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం, ఏఐ ఇప్పుడు కార్యాలయంలో వాస్తవంగా కనిపిస్తుందన్నారు. భారతదేశంలో నాలెడ్జ్ వర్కర్లలో ఏఐ స్వీకరణ రేటు 92శాతం వద్ద అత్యధికంగా ఉందన్నారు. ఈ స్వీకరణ రేటు బీఎఫ్ఎస్ఐ నుండి హెల్త్‌కేర్ నుండి ఐటీఈఎస్ వరకు, పబ్లిక్ సెక్టార్ వరకు అన్ని రంగాల్లో ఆశాజనకంగా వుందన్నారు. ఈ ఏఐ ఆశావాదం సంస్థలు సరైన సాధనాలు, శిక్షణలో పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగుల కోసం సామర్థ్యాలను అన్‌లాక్ చేయడానికి, చివరికి దీర్ఘ కాలం వ్యాపార ప్రభావం చూపడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు.

లింక్డ్‌ఇన్‌లో టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ హెడ్ రుచీ ఆనంద్ మాట్లాడుతూ… పని ప్రపంచాన్ని ఏఐ మారుస్తోందన్నారు. ప్రతిభను పునర్నిర్వచిస్తుందన్నారు. మార్పును స్వీకరించడానికి వ్యక్తులు, సంస్థలను ఇరువురిని ప్రోత్సహిస్తోందన్నారు. ఏఐ నైపుణ్యం కోసం డిమాండ్ గతం కంటే 17శాతం పెరిగిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement